వినాయకుని పూజలో గ్లాసు , కలశం , ప్లేట్ , గిన్నె, దీపం మొదలైన పాత్రలను ఉపయోగిస్తాము . ఇవి ఉపయోగించటంవలన మనకి శుభం కలుగుతుంది అని గ్రంథాలలో పేర్కొనబడ్డాయి.

ఈసారి మనం ఆగస్టు 22 అంటే శనివారం గణేష్ పండుగ జరుపుకుంటున్నాము . పండగ రోజు మనం గణేష్ పూజలో చాలా పాత్రలు వాడుతాము.వాటిలో బంగారం, వెండి, రాగి పాత్రలు పవిత్రమైనవి.
వినాయకుని పూజ కార్యక్రమంలో పాత్రలు బంగారం, వెండి, ఇత్తడి లేదా రాగి ఉపయోగిస్తే చాలా మంచిది . పూజ నిర్వహించే వారి బలం ప్రకారం ఈ నాలుగు లోహ పాత్రలలో దేనినైనా పూజలో వాడుకోవచ్చు . ఆరాధన సమయంలో ఈ పాత్రలలో నీటిని వుంచుతాము కాబ్బటి ఈ లోహాల వాళ్ళ కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి . పూజ తరువాహత పాత్రలలో ఉండే నీటిని తీసుకోవడం ద్వారా మనకు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఆయుర్వేదం మందులలో స్వర్ణ భాస్మా ,రజత్ భాస్మాను అనేక వ్యాధులలో మందులుగా ఉపయోగిస్తారు. పాత్రలలో ఉంచిన స్వచ్ఛమైన నీటిని తీసుకోవడం ద్వారా కూడా అలాంటి ప్రయోజనం పొందుతాము .
దేవుడిని ఆరాధించే సమయంలో మనం ఇనుము, ఉక్కు మరియు అల్యూమినియం పాత్రలను మాత్రం వాడవద్దు గుర్తుంచుకోండి. ఇనుము మరియు అల్యూమినియంలోని నీటిని ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేయవు . అందుకే చాలా ఇళ్లలో ఈ లోహాలను ఇంటి ,వంట పాత్రలుగా వాడారు .