వైఎస్సార్ బీమా పధకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు .దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఉచితంగా బీమా కల్పించటం కోసం ఈ పధకాన్ని ప్రారంభించారు .
పధకం ప్రారంభించిన తరువాత సీఎం జగన్ మాట్లాడుతూ ఈ పధకం ద్వారా రాష్ట్రంలోని 1 .41 కోట్ల కుటుంబాలు లబ్ది పొందనున్నారు అని అన్నారు .ఈ బీమా పధకం నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించేందుకు సిద్దమయింది అని తెలిపారు .అలాగే పధకంలో ఎంత లబ్ది పొందుతారో కూడా వివరించారు .18 – 50 వయసు మధ్య వారు మరణిస్తే రు. 5 లక్షలు ,51 – 70 వయసు మధ్య వారు మరణిస్తే రు . 3 లక్షలు , సహజ మరణానికి రు .2 లక్షలు , ప్రమాదంలో పాక్షిక వైకల్యం పొందితే రు .1 .50 లక్షలు బీమా వస్తుంది అని తెలిపారు .ఆక్సిడెంట్ లో మరణిస్తే తక్షణం 10 వేలు అందిస్తామని సీఎం జగన్ అన్నారు . కుటుంబంలో ఎవరికైనా ఆపద వస్తే ఆదుకోవడానికి ఈ పధకం ప్రారంభించాము అని ,ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మా లక్ష్యం అని జగన్ వెల్లడించారు .
Also Read