వైసిపి VS బిజెపి : వినాయకచవితి నిబంధనల వివాదం

0
432
వైసిపి VS బిజెపి : ముందుంచి బిజెపి జగన్ ప్రభుత్వంపై హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని ప్రచారం చేస్తూనే ఉంది . దేవాలయాలపై జరిగిన దాడుల గురించే కావచ్చు అలాగే దేవాలయాలపై తీసుకున్న నిర్ణయాలలో కావచ్చు బిజెపి ఆందోళన చేస్తూనే ఉన్నది . దానికి తోడు ఇప్పుడు జగన్ ప్రభుత్వం వినాయకచవితి సందర్బముగా పెట్టిన ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ .
వైసిపి VS బిజెపి

ఏపీలో వినాయకచవితి పండుగను జరుపుకునే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జిఓ ఒకింత భక్తులలో వ్యతిరేకత రేపెలా ఉండనే అభిప్రయం వ్యక్తమవుతోంది . బిజెపి నాయకులూ అలాగే హిందూ మాత సంఘాలు ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకపడమే కాకుండా మరోసారి జగన్ హిందూ వ్యతిరేకి అనే భావం ప్రజలలో కల్పించేలా చేస్తుంది .

బార్లు , సినిమా హాళ్లు , వాళ్ళ నేతల కార్యక్రమాలకు , స్కూల్ లకు లేని నిబంధనలు ఒక్క వినాయక చవితికి ఎందుకు అని విమర్శిస్తున్నారు . వినాయక చవితి పండగ అంటేనే అందరు కలిసి చేసుకునేది అలాంటిది ఇంట్లోనే జరుపుకోవాలనుకోవడం హిందువుల మనోభావాలను గాయపరిచేవిధంగా ఉన్నాయి అని నేతలు అంటున్నారు . మొహరం , వైఎస్ జయంతికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఈ పండుగకు ఎందుకు ఇవ్వటంలేదని అంటున్నారు .

విహెచ్ పి , బిజెపి నేతలు గవర్నర్ ని కలిసి వినతి పత్రం అందచేశారు . ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టిన , అనుమతి ఇవ్వకున్నా పండుగ జరిపి తీరుతామని అన్నారు . అయితే వినాయక పండుగ కు సంబందించి దాఖలైన పిటిషన్ విచారించిన ఏపీ హై కోర్ట్ వినాయక ఉత్సవాలకు అనుమతి ఇచ్చింది . మత కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని ప్రైవేట్ స్థలంలో ఒకేసారి ఐదుగురికి మించకుండా ఉత్సవాలు జరుపుకోవాలి సూచించింది . మొత్తానికి వినాయక్ చవితి వైసిపి VS బిజెపి ల మారింది .

హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక 2021 జాప్యానికి కారణం వారేనా ? Exciting