వైసీపీ VS టీడీపీ : పరిషత్ ఫలితాల తరువాత భవిష్యత్తు పై దృష్టి పెట్టిన 2 పార్టీలు- Focus

0
2094
వైసీపీ VS టీడీపీ: కేసీఆర్(KCR) బలంగా ఉద్యమం కొనసాగిస్తున్న తరుణంలో కూడా ఫలితాలు ఎలా ఉన్న పార్టీ చిన్న ఎలక్షన్(ELECTIONS) లలో నిలబడింది టీడీపీ(TDP) . మరి ఏపీ లో జరిగిన పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించడం తప్పుడు నిర్ణయంగా ఉండబోతుందా . ప్రతి ఎన్నికలలో విజయం సాధిస్తూ వస్తున్నా వైసీపీ(YCP) కి ఎన్నికలు పోటీచేయకుండా నేరుగా విజయం ఇచ్చినట్టులే అనేది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం .ఇప్పుడు రెండు పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృషి సారించడంతో ఎవరి వ్యూహం ఏమిటి అనేది చర్చగా మారింది .
వైసీపీ VS టీడీపీ

వైసీసీ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ టీడీపీ అధినేత ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు .ఈ నిర్ణయానికి టీడీపీ శ్రేణిలో వ్యతిరేకత కూడా వచ్చింది . అయినా చంద్రబాబు బహిష్కరణకే మొగ్గు చూపారు . ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీకే దాదాపు స్థానిక ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి .చంద్ర బాబు కూడా అధికార ,ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడే . మరి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని ఆ పార్టీ కార్య కర్తలకే అర్ధం కాలేదు .

వందలాదిమంది కార్యకర్తలు హత్యకు గురవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ చిన్న ఎన్నికలు విడిచిపెట్టలేదు టీడీపీ . మొదటిసారి టీడీపీ చరిత్రలో ఎన్నికలు బహిష్కరించడం కార్యకర్తల మనో బలాన్ని తగ్గించినట్లు అయింది . 2014లో అధికారం రాక పోవడంతో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చారు . అధికారంలోకి రాగానే నవరత్నాలు కచ్చితంగా అమలు అయేలా చూడాలని అధికారులకు తెలిపాడు . ఆర్ధిక పరిస్ధితితో సంబంధం లేకుండా పథకాలకు నిత్యం ప్రారంభోత్సవాలు చేస్తూడబ్బులు బదిలీ చేస్తూ వస్తున్నారు.

టీడీపీను తెలీగా తీసి పారేయలేమనివైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్న అభిప్రాయం .మరి వచ్చే ఎన్నికల్లో ఈ హామీలన్నీ అమలు చేస్తామంటూనే మరిన్ని హామీల్ని ప్రతిపక్షం గుప్పిస్తే అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వైసీపీకి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది . ముఖ్యంగా చంద్రబాబు తమ హామీల్ని మించిన హామీలు గుపిస్తే వాటిని ఎలా కౌంటర్ చేయాలన్న దానిపై వైసీపీలో అంతర్గతంగా చర్చ మొదలైనట్లు తెలుస్తోంది..

అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని ఎన్నికల్లోవిజయం సాధిస్తున్న వైసీసీన ప్రభుత్వం భవిషత్తు లో చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉంటాయి మనం ఏమిచేయాలి అనే దానిపై అధికార ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది .వచ్చే ఎన్నికలలో వైసీపీ VS టీడీపీ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.

రేవంత్ రెడ్డి vs ఎంపి కోమటిరెడ్డి : ఫ్రెండ్స్ మధ్య దూరం ఇప్పట్లో తగ్గదా ? Competitive