వై ఎస్ షర్మిల పార్టీ : జండా గుర్తు ఆవిష్కరణ చేవెళ్లలోనే ? Launch

0
1840
వై ఎస్ షర్మిల పార్టీ పెట్ట బోతున్నారు అనే వార్త కోడికి రోజులుగా జోరుగుగా ప్రచారం సాగుతూ వస్తుంది . మంగళవారం రోజు లోటస్ పాండ్ లో రాజశేఖర్ రెడ్డి అభిమానుల పేరిట ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడంతో ఆమె రాజకీయ పార్టీ ప్రకటనపై అందరిలో ఆసక్తి నెలకొంది . ఇప్పుడు షర్మిల వెనుక ఎవరు ఉంది నడిపిస్తున్నారు అనే కోణంలో అందరిలో ఆలోచన రేకెత్తిస్తుంది . షర్మిల తన తల్లి తండ్రుల వివాహ దినోత్సవం పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఒక విశేషం సంతరించుకొంది .
వై ఎస్ షర్మిల పార్టీ

కొద్ది రోజులుగా వైఎస్ జగన్ మీద అసంతృప్తిగా ఉన్న షర్మిల సొంతంగా కొత్త పార్టీ పెడుతుంది అని ప్రచారం జరుగుతూ వస్తుంది . ఆవిధం గానే బారి కటౌట్ల మధ్య లోటస్ పాండ్ లో ఆత్మీయ సమ్మేళనము పెట్టింది . ఈ సమ్మేళనము రాజకీయ సంచలనానికి తెరలేపింది . షర్మిల తన మనసులో విషయాలు బయట పెడుతూ
” జగన్ అన్నకు ,తనకు ఎలాంటి పోటీ ఉండదు . అన్న పార్టీ ఆంధ్రాలో ఉంటె ,నా పార్టీ తెలంగాణాలో ఉంటుంది” అని తెలిపింది . ఎవరి ఎజండాతో వారు పని చేసుకుంటారు అని తెలిపినది . తెలంగాణాలో రాజన్న రాజ్యం లేదని అది తేవడానికి నేను ప్రయత్నిస్తునాను అని తెలిపింది . షర్మిల అభిమానులు ఈ పార్టీ జగన్ కు తోక పార్టీగా ఉండదని , తెలంగాణ న్యాయం జరిగే విషయంలో జగన్ తో అయినా విభేదిస్తామని తెలిపారు . దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి బాటలో షర్మిల కూడా తమ పార్టీ జెండాను చేవెళ్ల లో ఆవిష్కరిస్తామని తెలిపారు .

హైద్రాబాద్ లోడబుల్ డెక్కర్లు : మల్లి మహానగరంలో తిరగనున్న బస్సులు …. 25 బస్సులతో మొదలు- Wow