శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు 2020 కోసం సిరిమాను కోసం పూజారి భీమశింగి సమీపంలో ఉన్న బలరాం పురం వద్ద గుర్తించడం తో ఆ చెట్టుకు దేవస్థానం ఇ ఓ. ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

ఈ పూజల్లో అర్చకులు, బలరాం పురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సిరిమాను గుర్తింపుతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ నెల 12వ తేదిన ఉదయం 9.15 నిమిషాలు కు సిరిమాను చెట్టు కొట్టెందుకు శ్రీకారం చుట్టిన దేవాలయంఅధికారులు
శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు
పైడి తల్లి ఉత్తరాంధ్ర ప్రజల డై వం . పూసపాటి రాజుల ఇలవేల్పు . ఈ అమ్మవారి ఉత్సవాలు 1758 లో ప్రారంభం అయినాయి . మొదటిసారిగా 1757 లో విజయదశమి తరువాత వచ్చే మంగళవారం రోజు విజయనగరం చెరువునుండి అమ్మవారి విగ్రహాన్ని అప్పల స్వామినాయుడు బయటకు తీశారు .
అమ్మవారికి తోలి పూజచేసింది కూడా ఆయనే . అప్పడినుండి అమ్మవారికి వారి కుటుంబంలోని వారే పూజలు నిర్వహిస్తూ ఉన్నారు . సిరిమాను ను అధిరోహించి భక్తులను ఆశీర్వదిస్తాడు .
పైడి తల్లి విజయరామరాజు చెల్లెలు . చినప్పడినుండే దేవి ఉపాసన చేసేది . అన్న బొబ్బిలి ఫై యుద్ధనికి సిద్ధం కావడం ఆమెను బాధపెట్టింది . చెల్లెలు ఎంత చెప్పిన విజయరామరాజు వినలేదు . విజయం విజయరామరాజునే వరించింది .
ఆరోజు రాత్రి దేవి కలలోకి వచ్చి అన్న ప్రాణాలకు వచ్చిన ముప్పును హెచ్చరించింది . ధీక్షలో ఉన్న ఆమె పసివాడ అప్పల నానుడిని వెంట బెట్టుకొని బొబ్బిలి ప్రయాణం అవుతుంది . మార్గమధ్యంలో ఆమె అపమారక స్థితిలోకి జారుకుంది .
న ప్రతిమ పెద్ద చెరువులో లభిస్తుంది అని దానిని ప్రతిష్టించి నిత్యం పూజలు ఉత్సవాలు చేయాలనీ చెప్పి దేవి లో ఐక్యమైంది .