సింగర్ సునీత పెళ్లి రెండో పెళ్లి చేసుకుంటుంది అని టాలీ వుడ్ లో గత కొన్ని రోజులుగా వార్త వినిపిస్తూవుంది . అయితే వాటిపై సునీత ఎలాంటి స్పందన తెలపలేదు . అందరు అది గాసిప్ కావచ్చు అనుకున్నారు . కానీ ఇవాళ సునీత నిశ్చితార్థం జరగడంతో ఆ విషయం కన్ఫర్మ్ అయింది .

సోమవారం ఉదయం వ్యాపార వేత్త రామ్ వీరప్పనేని తో సింగర్ సునీత నిశ్చితార్థం జరిగింది . ఇంట్లోనే చాల నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు . 19 ఏళ్ళ వయసులోనే సునీత మొదటి వివాహం చేసుకుంది . ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు . మొదటి భర్త తో మనస్పర్థలు వచ్చి విడిపోయారు .

రామ్ వీరప్పనేనిది కూడా రెండో వివాహమే . ఇతను ఒక మీడియా సంస్థ అధినేత . మాంగో యూట్యూబ్ ఛానల్ అతనిదే . సునీత పెళ్లి విషయం సోషల్ మీడియా ద్వారా తెలియ చేసింది . తన పిల్ల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది . న నిర్ణయాన్ని అభిమానులు , స్నేహితులు గౌరవించాలని కోరుకుంటున్నాను .
ఏలూరులో వింత రోగం .. బాధితులను పరామర్శించిన సీఎం జగన్- Mystery