సిటీ బస్సుల సర్వీస్ హైదరాబాద్ లో షురూ-ఏ రోజు అంటే

0
612

సిటీ బస్సుల సర్వీస్ హైదరాబాద్ లో కరోనా కారణంగా లాక్ డౌన్ మొదలు అయినప్పటినుండి నిలిచి పోయిన సంగతి తెలిసిందే .

సిటీ బస్సుల

సిటీ బస్సులు


హైద్రాబాదులో శుక్రవారం నుండి తిరగనున్న బస్సులు


దాదాపు 3000 పై చిలుకు బస్సులు మల్లి రోడెక్కనున్నాయి . ప్రభుత్వం పాక్షికంగా నగర శివారులలో బుధవారం నుండి కొన్ని సర్వీస్ లను ప్రారంభించింది . శుక్రవారం నుండి మొత్తం సిటీ బస్సులను నడపాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు .

శివారులలో ఆర్డినరీ బస్సులను మాత్రమే చాల తక్కువ సంఖ్యలో నడిపారు .GHMC డిపోలలో మొత్తం 3000 లపైన బస్సులు ఉన్నాయి . అన్నింటిని శుక్రవారం నుండి నడపడానికి అన్ని చర్యలు వేగవంతముగా జరుగుతున్నాయి .

కేంద్రం లాక్ డౌన్ సడలించడంతో జిల్లాలో మే 19 నుండి బస్సు సర్వీస్ లు మల్లి ప్రారంభం అయినా విషయం అందరికి తెలిసిందే . అప్పుడు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సిటీ బస్సులను అనుమతించలేదు .

కరోనా నిబంధనలు సిటీ బస్సులలో పాటించడం కష్టం అని ఆనిర్ణయం తీసుకున్నారు . ఇక అంతర్ రాష్ట్ర బస్సుల విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం కుదరక పోవడంతో ఆ సర్వీస్ లను ప్రారంభించలేదు .
మూడురోజుల క్రితం విజయవాడలో అక్కడి ప్రభుత్వం సిటీ బస్సులను అనుమతించింది . దానితో తెలంగాణ ప్రభుత్వం కూడా నడపాలని ఆలోచనకు వచ్చింది . అందుకే 15 కిలీమీటర్ల పరిధిలో నగర శివారులలో సిటీ బస్సులను నడిపారు .

బుధవారం నడిచిన బస్సుల గురించి ఇంచార్జి ఏం డి సునీల్ శర్మతో సి ఎస్ సోమేశ్ కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు . దాదాపు ప్రజలు సాధారణ పరిస్థితికి రావడం ,కరోనా ఫై అవగాహన పెరగడంతో అన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని సోమేశ్ కుమార్ సూచించారు .

తెలంగాణాలో ఇంకా అతి భారీవర్షాలు -వాతావరణ శాఖ