సినీ నటి కుష్బూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది . నటి ,బీజేపీ నేత అయినా కుష్బూ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాయకులతో కలసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది .

నవంబర్ 6 నుండి డిసెంబర్ 6 వరకు బీజేపీ తమిళనాడులో వేల్ యాత్ర కార్యక్రమము చేపట్టింది . కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలను ప్రజలలోకి తీసుకెళ్లడం దీని ఉద్దేశం . తిరుత్తణి లో ప్రారంబయి ఈ యాత్ర తిరుచెందూరులో ముగుస్తుంది . దీనిలో పాల్గొనేందుకు నాయకులూ ,కార్య కర్తలు భారీగా పాల్గొంటున్నారు .
బీజేపీ నాయకురాలు అయినా కుష్బూ ఈ కార్యక్రమములో పాల్గొనేందుకు బుధవారం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది . విల్లుపురం జిల్లా మేల్మర్వతుర్ పట్టణ సమీపంలో టాంకర్ డీ కొట్టింది . వెనుక భాగం నుండి ఢికొట్టడం తో వెనుక భాగం అంత నుజ్జునుజ్జు అయింది . సినీ నటి కుష్బూ డ్రైవర్ ప్రక్కన కూర్చోవడం వలన ఎలాంటి గాయాలు లేకుండా బయట పడింది . పెను ప్రమాదం తప్పడం ,కుష్బూ సురక్షితంగా బయట పడడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు
Also Read
కల్వకుంట్ల కవిత : మొదలుపెట్టిన గ్రేటర్ ప్రచారం – Responsible