సినీ నటుడు సుమన్ : భారత దేశంలో పుట్టిన అందరు లోకలే

0
752
సినీ నటుడు సుమన్  మా ఎన్నికలు పై తన అభిప్రాయాన్ని వ్యక్తం  చేసారు . మా ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలల సమయం ఉన్న ఇప్పడినుండే  ఆ వేడి మొదలయింది . ప్రకాష్ రాజ్ అధ్యక్ష బరిలో ఉండడంతో ఇప్పుడు లోకల్ ,నాన్ లోకల్ అనే మాట హల్చల్ చేస్తుంది .
సినీ నటుడు సుమన్

సినీ నటుడు సుమన్ బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం పురష్కరించుకొని  ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు . కార్యక్రమములో వైద్యుల సేవలను కొని ఆడుతూ పరోక్షంగా మా ఎన్నికల గురుంచి మాట్లాడారు . అందరు కలసి కట్టుగా ఉండాలని ,దేశంలో పుట్టిన అందరు లోకలే , లోకల్ – నాన్ లోకల్ గురుంచి మాట్లాడడం  కరెక్ట్ కాదని అన్నారు . మా ఎన్నికల కారణంగా తెరపైకి వచ్చిన  లొకాలిటీ గురుంచి పరోక్షంగా తన అభిప్రయాన్ని వెలిబుచ్చారు . వైద్యులు , రైతులు ఆలా అనుకుంటే మనకి ఆహారం , చికిత్స అందదు అని అన్నారు . మా ఎన్నికలు పై సినీ నటుడు సుమన్ మాట్లాడం చూస్తుంటే పరోక్షంగా ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపాడు .

ఇంకా కొంత సమయం ఉన్నపటికీ  మా  ఎన్నికలు రోజు రోజుకి ఉత్కంఠంగా  మారుతుంది . ఈసారి అధ్యక్షా బరిలో మొత్తం ఐదుగురు సభ్యులు నిలబడుతున్నట్టు సమాచారం . చివరికి ఎంత మంది ఉంటారనేది చూడాలి . ప్రకాష్ రాజ్ ,  మంచు  విష్ణు  ఉండడంతో ఫిలిం నగర్ లో ఆసక్తి నెలకొంది .

ఐపీఎల్ కొత్త జట్లు : వాటి ధర ఎంత అంటే ? wow