సినీ విలక్షణ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో బాత్రూమ్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రభుత్వం విధించినప్పటి నుండి ఆయన గుంటూలో ఉంటున్నారు.

సినీ విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1946 అక్టోబర్ 10 న జన్మించాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. నెల్లూరులోని పత్తేకాన్పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు.డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు. నల్గొండలో నాటకాలు వేస్తున్న సమయంలో అతని నటన నచ్చిన దాసరి రామానాయుడు కి పరిచయం చేసాడు .
1988లో వేంకటేష్ హీరోగా నటించిన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం లో రాయలసీమ యాసలో ప్రతినాయకునిగా మంచి పేరు తీసుకునివచ్చింది.బాలకృష్ణ హీరోగా సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో విలన్ పాత్రతో ప్రేక్షకుల గుండెలలో నిలిచిపోయాడు .
దీనితో పాటు జయం మనదేరా,చెన్నకేశవరెడ్డి , కిక్,ఎవడి గోల వాడిది,ఢీ సినిమాలు మంచి పేరు ని తెచ్చాయి .