సీఎం కేసీఆర్ వైద్యపరీక్షలు : ఎలాంటి ఇబ్బంది లేదు డా:MV రావు- Fine

0
843
సీఎం కేసీఆర్ వైద్యపరీక్షలు : ఊపిరితిత్తుల్లో మంట (lungs burning)గా ఉండడంతో బుధవారం ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో గురువారం నిర్వహించారు .
సీఎం కేసీఆర్ వైద్యపరీక్షలు

గురువారం మద్యాహ్నం రెండున్నర గంటలకు సికింద్రాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు . వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డా:MV రావు మాట్లాడుతూ ఊపిరితిత్తులలో స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ ఉంది, ఐదు రోజులకు మందులు ఇచ్చాము . 2d ఎకో రిపోర్టులు రావలసి ఉంది . కేసీఆర్‌కు ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు . ఇంతకముందే కేసీఆర్ కి బ్రాంకయిటీస్ సమస్య ఉండటంతో ప్రతి శీతాకాలంలో ఇబ్బంది ఉంటుంది. అందుకే అన్ని పరీక్షలు నిర్వహించాము అని అన్నారు .

కరోనా వాక్సినేషన్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు- Rules