సునామీలా కరోనా వైరస్ : భారత దేశంలోరికార్డ్ స్థాయిలో వ్యాప్తి- Beware

0
540
సునామీలా కరోనా వైరస్ :రెండోదశలో కరోనా మహమ్మారి భారత దేశంలో రికార్డ్ స్థాయిలో విజృంభిస్తుంది . గత 24 గంటలలో కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం 17 లక్షలకు పైగా టెస్టులు చెయ్యగా 3,40,000 పైచిలుకు కేసులు నమోదు అయ్యాయి . దేశం లో మొత్తం 1,69,60,000 లాకిపైగా కేసులు నమోదు అయ్యాయి . 2,17,000 ల పైచిలుకు మంది మహమ్మారినుండి కోలుకున్నారు .
సునామీలా కరోనా వైరస్

రెండో దశలో సునామీలా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో మరణాల సంఖ్యకూడా పెరిగింది . మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి . గత 24 గంటలలో 2,700 మంది కరోనా కారణంగా మరణించారు . మొత్తంగా వైరస్ ప్రభావం మొదలైనప్పటినుండి ఇప్పడి వరకు 1,92,300 మంది చనిపోయారు . ఇప్పటి వరకు లెక్కల ప్రకారం టీకాలు పొందిన వారి సంఖ్య 14,09,16,400 మంది .

ఇంకా దేశంలో మహారాష్ట్ర ,ఢిల్లీ లో వైరస్ ప్రభావం చాల విపరీతం గా ఉంది. మహారాష్ట్రలో నిన్న 67,000 పైగా కేసులు నమోదు అయ్యాయి . ఢిల్లీ లో ఒక్కరోజే 24,000 పైగా కేసులు నమోదు అయ్యాయి . దీని బట్టి చుస్తే ఆ రాష్ట్రాలలో ఎలా ఉందొ అర్ధం అవుతుంది . అందుకే ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ మీడియా ద్వారా అవసరం ఉంటేనే జాగ్రత్తలు పాటిస్తూ బయటికి రావాలి , ప్రభుత్వం నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు .

మన పేరుమీద ఫోన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో ఇలా తెలుసుకోండి