సునీల్ నరైన్ బౌలింగ్ పై మరోసారి దుమారం రేగుతుంది . శనివారం జరిగిన కోల్కోత పంజాబ్ లమధ్య జరిగిన మ్యాచ్ లో అతని బౌలింగ్ శైలి పై అనుమానం వ్యక్తం అయింది .

కోల్కతా పంజాబ్ మ్యాచ్ ఫీల్డ్ అంపైర్లు ఉల్హాస్ ,గఫ్హెని నరైన్ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధం గా ఉందని బీసీసీఐ కి పిర్యాదు చేసారు . నరైన్ ను హెచ్చరికల జాబితాలో ఉంచుతున్నాము అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది .
ఇది కొంచెం కేకేఆర్ ను ఇరకాటం లో పెట్టె విషయమే . అయితే ఇప్పటికిప్పుడు ప్రాబ్లెమ్ ఏమిలేదు. ప్రస్తుతం నరైన్ బౌలింగ్ వేసుకోవచ్చు . మల్లి కంప్లైంట్ వస్తే మాత్రం బీసీసీఐ నుండి క్లియరెన్స్ తీసుకోవలసి ఉంటది .
ఇంతక ముందు కూడా తన బౌలింగ్ పై నిషేధాన్ని ఎదుర్కున్నాడు . నిషేధం కారణంగా 2015 వరల్డ్ కప్ ఆడలేదు . తరువాత ఐసీసీ 2016 లో అనుమతి ఇచ్చింది . పాకిస్థాన్ సూపర్ లీగ్ 2018 లో కూడా పిర్యాదు రావడం జరిగింది .
ఇప్పుడు టీ 20లో కూడా కొన్ని షరతులతో అనుమతి ఇవ్వడంతో కేకేఆర్ జట్టులోకి తీసుకున్నారు . బీసీసీఐ సూచనలు మేరకు కొన్ని మార్పులతో నరైన్ బౌలింగ్ చేస్తున్నాడు .
శనివారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 18 బంతులతో 22 పరుగులు చేయాలి . అప్పుడు నరైన్ బౌలింగ్ కు దిగాడు . చివరి ఓవర్ లో 6 బంతులకు 14 చేయవలసి ఉండగా 12 పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్ కు విజయాన్ని అందించాడు .
టీ 20 లీగ్ లలో 127 వికెట్స్ 116 మ్యాచ్లు అది తీసుకున్నాడు . లెఫ్ట్ హ్యాండ్ బాట్స్మన్ అయినా సునీల్ నరైన్ మంచి బ్యాటింగ్ కూడా చేయగలడు . కేకేఆర్ కీలక బౌలర్ అయినా నరైన్ తరువాత మ్యాచ్ లలో ఎలాఉంటుందో చూడాలి .
flipkart – amazon festival sale : అమెజాన్ ఫ్లిప్ కార్ట్ లో 2020 super బిగ్ డిస్కౌంట్ సేల్ – hurry