సూపర్ స్టార్ రజనీకాంత్ అధిక రక్తపోటు కారణంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయినాడు . రక్తపోటులో హెచ్చుతగ్గులతో చాల తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ఆసుపత్రిలో చేరారు .

అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌కు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు అని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలియచేసారు . ఈ నెల 22న నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. బీపీలో హెచ్చుతగ్గుల వల్ల ఆస్పత్రిలో చేరారు. బీపీలో హెచ్చుతగ్గులు అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నాం వైద్యులు తెలిపారు .
అత్యవసరంగా రజినీకాంత్ ఆసుపత్రిలో చేరడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది . సూపర్ స్టార్ మల్లి ఆరోగ్యంగా షూటింగ్ లో పాల్గొనాలి అని అభిమానులు కోరుకుంటున్నారు . జనేసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరినట్టు తెలిసి బాదపడినట్టు తెలిపారు . ఆధ్యాత్మికత కల రజినీకాంత్ గారు త్వరగా కోలుకోవడానికి భగవంతుని ఆశీర్వాదం ఉంటుందని అన్నారు . త్వరగా కోలుకొని ఆరోగ్యంతో మన ముందుకు రావాలని కోరుకున్నారు .
ఈనెల 31 న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ లాంచ్ వుంది . ఇప్పుడు ఆసుపత్రిలో చేరడంతో ఆ కార్యక్రమము పరిస్థితి ఎలాఉంటుందా అని రాజకీయ అభిమానుల్లో కొంత ఆందోళన లేకపోలేదు .
కొత్త కరోనా స్ట్రైన్ 70శాతం వేగంగా విస్తరిస్తుంది … మార్పుచెందడం అంటే ? Strange