సైబరాబాద్ సీపీ జీహెచ్ఎమ్ సీ ఎన్నికలు 2020: కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహణ

0
540
సైబరాబాద్ సీపీ జీహెచ్ఎమ్ సీ ఎన్నికలు 2020 కోసం చట్టపరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు . ఏన్నికల కోసం 13,500 వేల మంది పోలీసులతో అన్ని భద్రత పరమైన ఏర్పాట్లు చేసాము. వీరిలో 10,500 సివిల్, 3000 మంది Armed Reserve సిబ్బంది ఉంటారు అని అన్నారు .
సైబరాబాద్ సీపీ జీహెచ్ఎమ్ సీ ఎన్నికలు 2020

సైబరాబాద్ సీపీ జీహెచ్ఎమ్ సీ ఎన్నికలు 2020 మాట్లాడుతూ ఎన్నికలకోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసాము . పోలీస్ సిబ్బందికి మూడు సార్లు తర్ఫీదు ఇచ్చము,స్టేట్ ఎలక్షన్ కమీషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాము. నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ, సిఐ స్థాయి అధికారి, ఏసీపీ, ఏడీసీపీ, డీసీపీల నేతృత్వంలో భద్రత ఏర్పాటు చేశాం అన్నారు .

38 స్ట్రైకింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 9 సీపీ రిజర్వ్ టీమ్స్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 11 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు అందుబాటులో ఉంటారు. 73 హైపర్ సెన్సిటివ్ పికెట్ లు నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసాము.హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద 1 ఎస్ ఐ, 4 ఏఆర్ సిబ్బంది ని ఏర్పాటు చేశాము అని తెలిపారు .

సైబరాబాద్ కమిషనరేట్ లో 38 వార్డ్ లు , 2437 పోలింగ్ స్టేషన్లు , 1421 నార్మల్ పోలింగ్ స్టేషన్ లు ,766 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ,250 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.177 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాము. సైబరాబాద్ లో 15 బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం. హైపర్ సెన్సిటివ్ ఏరియా ల్లో 73 పికెట్ లు ఏర్పాటు చేశాం అని అంన్నారు .

587 లైసెన్సేడ్ గన్స్ డిపాజిట్ చేయడం జరిగింది. 369 మంది రౌడీ షీటర్ లను బైండోవర్ చేశాం. రూ. 15 లక్షలు విలువ చేసే 396 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం . ప్రతి పోల్ల్లింగ్ స్టేషన్ కు జియో ట్యాగింగ్ చేశాం.సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం. పెండింగ్ లో ఉన్న 24 మంది పై నాన్ బెయిబుల్ వారెంటిలు ఎక్జి క్యూట్ చేశాం.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సిసిటివి లు ఏర్పాటు చేసి వాటిని ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేశాం. జియో ట్యాగింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని అనుసంధానం చేసాము.1 లక్ష సీసీ కెమెరాలు ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేస్తున్నాము.డిసిపి, ఏ సిపి ఆఫీస్ లో రౌండ్ ది క్లాక్ నిరంతర పర్యవేక్షణ ఉంచాము.ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా ఉంచాము.

రేపు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఓటర్ లు నిర్భయంగా తమ ఓటు హక్కు నియోగించుకోవాలి.
ఎన్నికల గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి.ఎలక్షన్ ఏజెంట్ కి ప్రత్యేక వాహనం అనుమతి ఉండదు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ ల వద్ద ఓటర్ లు తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి. ఓటర్ లను తరలించడం చట్ట విరుద్ధం అలా చేస్తే వాహనాలు సీజ్ చేయబడతాయి. కోవిడ్ నియమ నిబంధనలు పాటించి ఓటింగ్ లో పాల్గొనాలి.

Also Read

సీఎం కేసీఆర్ మీటింగ్ 2020 : లాల్ బహుదూర్ స్టేడియం లో ప్రతిపక్షాలపై కామెంట్స్- Trend

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here