సోము వీర్రాజు పుష్కరాలు సమయంలో కూలగొట్టిన ఆలయాలను నిర్మించాలి- Focus

0
951
సోము వీర్రాజు పుష్కరాలు సమయంలో కూలగొట్టిన ఆలయాలను నిర్మించాలి అని ప్రకాశం బ్యారేజి సమీపంలో శనీశ్వర ఆలయం వద్ద బిజేపి ధర్నా నిర్వహించింది .రాష్ట్ర వ్యాప్తంగా చర్చిల‌ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించి సొమ్ముల వివరాలను విల్లడించారు సోము వీర్రాజు.
సోము వీర్రాజు

సోము వీర్రాజు వైసిపి ప్రభుత్వం తీరు పై మండిపడుతూ చంద్రబాబు హయాంలో పుష్కరాల పేరు చెప్పి అనేక ఆలయాలు పడగొట్టారు. ఆనాడు బిజెపి లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ ఆలయాలు కట్టాలంటూ ఆందోళన చేశారు. ఇప్పుడు ఉన్న దేవాదాయ శాఖ మంత్రి దర్గాలను కడతామని ప్రకటించారు . సిఎం జగన్మోహన్ రెడ్డి కు హిందూ సంప్రదాయ ల పై నమ్మకం, గౌరవం లేదా చంద్రబాబు కూడా పడగొట్టిన ఆలయాల పై మాట్లాడాలి,విజయవాడలో కూల గొట్టిన ఆలయాలను ప్రభుత్వం వెంటనే నిర్మించాలి అం డిమాండ్ చేసారు .

దర్గాలకు ఐదు కొట్ల రూపాలు, చర్చిలకు 24కోట్ల రూపాయలు నిర్మాణాలకు కేటాయించారు. చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం ధనాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు. రాష్ట్రం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ తీరు ఆందోళన కరంగా ఉంది. స్వామి వారి డిపాజిట్ సొమ్ములని ఇతర అవసరాలకు వాడుతున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో అనేక ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి అని అన్నారు .

ఆలయాల పనులు చేపట్టి ఎందుకు అభివృద్ధి చేయరు. చర్చిలు, దర్గాల గురించి మాత్రం దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడతారు.దేవాదాయ భూములను ఇళ్ల కోసం, నిధులను ఇతర కార్యక్రమం కోసం వాడుతారు . విచ్చలవిడిగా ఖర్చులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం లేదు. ఆలయాలను పట్టించుకోకుండా దర్గాలను కట్టిస్తా అని ఎలా కడతారు . వెంటనే మంత్రి వెల్లంపల్లి పదవికి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేస్తుంది అని అన్నారు .

రాష్ట్రం లో క్రైస్తవ చర్చిలకు వేల కోట్ల ఆదాయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కి దమ్ముంటే వీటి నుంచి డబ్బు తీసుకు‌ని ఖర్చు చేయాలి. ఆలయాలను కట్టడానికి మాత్రం నిధులు ఇవ్వరా. జగన్ కు చర్చిలు, మసీదు లే కావాలా.. ఆలయాల అభివృద్ధి అక్కర్లేదా.గతంలో ధార్మిక సంస్థల నిధులతో దళితవాడల్లో ఆలయాల నిర్మాణం జరిగింది. ఇక్కడ హిందూ ఆలయాలు సొమ్మును చర్చి, మసీదు లకు వాడుతున్నారు సోము వీర్రాజు ప్రభుత్వం ఫై మండి పడ్డాడు .

మందు బాబులకు ఝలక్ .. వ్యాక్సిన్‌ వేసుకుంటే2 నెలలు తాగుడు బంద్!no