హిమజ ‘జ ‘ సినిమా : రాహుల్ సిప్లిగంజ్ రీలీజ్ చేసిన ఫస్ట్ లుక్ – Horror

0
587
హిమజ 'జ ' సినిమా

హిమజ ‘జ ‘ సినిమా లో ప్రధాన పాత్రలో నటిస్తుంది . దుర్గా ఆర్ట్స్ పతాకంపై గోవర్ధన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తున్నాడు . బిగ్ బాస్ ఫేమ్ అయినా హిమజ , ప్రతాప్ రాజ్ నటిస్తున్న ‘జ ‘ హారర్ సినిమా .

హిమజ 'జ ' సినిమా

హిమజ ‘జ ‘ సినిమా

హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నటి హిమజ పుట్టిన రోజు సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు . ఈ కార్యక్రమానికి సింగర్ , బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యాడు . రాహుల్ ‘జ ‘ సినిమా ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ లోగో ను విడుదల చేసాడు . కార్యక్రమంలో సింగర్ శివ జ్యోతి , నిర్మాతలు పీఎల్ కె రెడ్డి ,తిప్పి రెడ్డి పాల్గొన్నారు .
బిగ్ బాస్ ఫేమ్ ,నటి హిమజ మాట్లాడుతూ నేను సీరియల్ షూటింగ్ లో ఉన్నపుడు దర్శకుడు సైది రెడ్డి వచ్చి కలిశారు . కథ చెప్పినప్పుడు ప్రధాన పాత్ర , మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను . నన్ను నటి గా పైస్థాయికి తెచ్చే మూవీ ఇది . నిర్మాత గోవర్ధన్ రెడ్డి గారికి , దర్శకుడు సైదిరెడ్డి గారికి కృతజ్ఞతలు .

టెక్నిషన్స్ ,తోటి ఆర్టిస్ట్ లనుండి మంచి సపోర్ట్ లభించింది . ‘జ ‘ సినిమా ఫస్ట్ లుక్ ని నా పుట్టినరోజు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది అని అంది . హిమజ ‘జ ‘ సినిమా కార్యక్రమంలో కేక్ కట్ చేసి బర్త్ డే సెలెబ్రేట్ చేసారు .

డైరెక్టర్ సైదిరెడ్డి మాట్లాడుతూ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి నేను సినిమా రంగం మీద ఫాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాను . ‘జ ‘ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాను . జ అంటే పుట్టుక అని అర్ధం . సినిమాకు ఈ పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే . కథా బలం ఉన్న సినిమా . నామీద నమ్మకంతో నిర్మాత గారు ఎక్కడ తక్కువ కాకుండా సినిమాను నిర్మించారు . మూవీ లో స్టార్ లు లేకున్నా అంతకుమ్మించి పెర్ఫార్మన్స్ లు ఉంటాయి . ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారి సహకారం బాగుంది . మీ అందరి ఆశీర్వాదం కావాలి . తొందరలోనే సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు .

Also Read

గ్యాస్ సిలిండర్ బుకింగ్ : నవంబర్ 1 నుండి కొత్త రూల్స్- Rules