హీరో నాని : నేనే బ్యాన్ చేసుకుంటా .. ఎవరు చేయవలసిన అవసరం లేదు- Clarity

0
2822
హీరో నాని టక్ జగదీష్ సినిమా సెప్టెంబర్ 10 న అమెజాన్ లో వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తున్నారు . హైద్రాబాద్ లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది . సినిమా ఓటిటి లో విధుల అవడంపై కొంత మంది అభ్యన్తరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ వేడుకలో నాని సినిమా గురించి అలాగే అమెజాన్ లో విడుదలగురించి చెప్పిన విశేషాలు చూద్దాం
హీరో నాని

హీరో నాని మాట్లాడుతూ టక్ జగదీష్ సినిమాలో కొత్త విశేషాలు , ట్విస్ట్ లు ఉంటాయని నేను చెప్పను , ఇప్పుడు మనం ఎలాంటి సినిమా మిస్ అవుతున్నామో అలాంటిది ఈ సినిమా . మన ఇల్లులాంటి సినిమా ,లగే ఇందులో అన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అన్నారు . ఈ ట్రైలర్ బుధవారం రిలీజ్ అయింది కానీ అంతకు ముందే కొంత మంది చూసారు . చుసిన వాళ్ళకి కళ్ళలో నీళ్లు తిరిగాయి . డైరెక్టర్ శివ కుటుంబ సంబంధ భవ్యాలను బాగా చూపించాడు . సినిమాను థియేటర్ లలో చూడడానికే ప్రేక్షకులు ఇష్టపడతారు . సినిమాను ఎంతగానో ప్రేమించే మేము కూడా ఓటిటి లో విడుదల చేస్తున్నాము అంటే అనుకు కారణం ఇప్పుడు ఉన్న పరిస్థితి . అందరు ఆదరిస్తారని న నమ్మకం .

ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో టక్ జగదీష్ విడుదల చేయడంపై కొంత మంది అబ్యన్తరం చేయడంపై నాని మాట్లాడుతూ వాళ్లంటే నాకు గౌరవం . వాళ్ళున్న పరిస్థితిలో ఆలా రియాక్ట్ అవడంలో తప్పులేదు .. నేను వాళ్ళ ఫ్యామిలీయే . నన్ను వేరుగా చూడడం బాధ అనిపించింది .న సినిమాను ఆపేస్తాము అనికూడా అన్నారట . నిజంగా బయట అంత బాగున్నపుడు కూడా న సినిమా థియేటర్స్ లో విడుదల కాకపోతే నన్ను నేనే బ్యాన్ చేసుకుంటాను అన్నారు నాని .

శివ నిర్వాణ మాట్లాడుతూ ” థియేటర్స్ లో సినిమా విడుదల కావడం లేదని తెలిసినప్పుడు కలిగిన భాద నాకు , నానికి మాత్రమే తెలుసు . థియేటర్స్ లో విడుదల చేసిన తరువాత తేడా వస్తే మాకు ఇచ్చే దాంట్లో కట్ చేసుకోమని చెప్పాము .ఐదు నెలలు వెయిట్ చేసిన నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు . శివ నిర్వాణ డైరెక్షన్ లో నాని ,రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్స్ గ సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మించారు

పూరి జగన్నాథ్ : డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ