హీరో సాయిధరమ్ తేజ్ కి ప్రమాదం : మెగా హీరో అలాగే చిరంజీవి మేనల్లుడు అయినా సాయిధరమ్ తేజ్ రోడ్ ప్రమాదం జరిగింది . మాదాపూర్లో ని కేబుల్ బ్రిడ్జి పైన స్పోర్ట్స్ బైక్పై నుంచి అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెవెళ్ళాడు . ప్రమాద విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు . . సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న కథనాలతో మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

శుక్రవారం రాత్రి హీరో సాయి ద్రం తేజ్ కి ఆక్సిడెంట్ అయింది . కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐకియా వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది . ప్రమాదం విషయం తెలియగానే కుటుంబ సభ్యులు పలువురు ఆస్పత్రికి చేరుకున్నారు. హీరో సాయిధరమ్ తేజ్ కి ప్రమాదం జరగడంతో చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తదితరులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని సాయి ధర్మ తేజ్ పరిస్థితి పై డాక్టర్స్ తో చర్చించారు .
ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ ధరించడం వలన ప్రాణాపాయ స్థాయిని నుండి బయట పడినట్లు తెలుస్తుంది .అతివేగంగా స్పోర్ట్స్ బైక్ను నడిపినందునే బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగస్టు 2న ఓ ఓవర్ స్పీడ్ కారణంగా ఆ బైక్పై ఛలాన్ పెండింగ్లో ఉంది. ఆసుపత్రి వర్గాలు ప్రాణానికి ఏమి ప్రమాదం లేదని 48 గంటలు పర్యవేక్షణలో ఉంటె చాలని చెప్పారు .
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక 2021 జాప్యానికి కారణం వారేనా ? Exciting