హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక 2021 జాప్యానికి కారణం వారేనా ? Exciting

0
532
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నది . తెరాస అభ్యర్థి ని ప్రకటించింది అలాగే బీజేపీ తరుపున సిట్టింగ్ ఎమ్యెల్యే గ రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ అభ్యర్థిగా ఉన్నారు . హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది . ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించాక పోవడానికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతలకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య గ్యాపే కారణమన్న వాదన వినిపిస్తోంది.హుజురాబాద్ అభ్యర్ధి ఎంపికకు సంబంధించి పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ నిర్వహించే కార్యక్రమాలపై పిసీసీ తమకు సమాచారం ఇవ్వడం లేదంటూ సీనియర్ల కామెంట్స్‌ చేస్తున్నారు . హుజురాబాద్ లో టికెట్ కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల లిస్ట్ ఏమిటి . రేవంత్ రెడ్డి అభ్యర్థి కోసం చేస్తున్న కసరత్తు ఏమిటి అనేది ఒకసారి విశ్లేషిద్దాం
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ బైపోల్‌ విషయంలో సీరియస్ గానే ఉన్నటు తెలుస్తుంది . అభ్యర్థి విషయంలో గట్టిగానే రచ్చ రేపుతున్నట్లు తెలుస్తుంది . అభ్యర్థి ఎంపిక చేసే విషయంలో నేతల మధ్య గ్యాప్ పెరిగిపోతుందని సమాచారం.ముగ్గురి పేర్లను హుజురాబాద్ ఉప ఎన్నిక వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న దామోదర్ రాజనర్సింహ ఫైనల్ చేసి పీసీసీ ముందు ఉంచారు . పీసీసీ సమావేశంలో వారిలో ఒకరిని ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఫైనల్ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలేవరు ఆ సమావేశానికి రాకపోవడంతోసీన్ రీవర్స్ అయ్యింది.హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వాయిదా వేయవలసి వచ్చింది .

ఇది ఇలా ఉంటె పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు సీనియర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తుంది. కరీంనగర్ లో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ స్థాయి సమావేశానికి మాణిక్కం ఠాగూర్ రావడం జరిగింది . ఆ సమావేశానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తప్ప సీనియర్ నేతలైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులకు సమాచారం ఇవ్వలేదనే మాట వినిపిస్తుంది .

హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై నిర్వహించిన సమావేశానికి సీనియర్స్ కి సమాచారం లేదనేది వాదన . అనుదుకనే నేతలు హుజురాబాద్ అభ్యర్థి ఎంపికకు దూరంగా ఉన్నారన్న మాట కాంగ్రెస్ వర్గాలలో వినిపిస్తోంది. ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కు జిల్లా నేతలు స్థానికులకే హుజురాబాద్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ లేఖ ఇవడంకూడా అభ్యర్థి ఎంపిక సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది .

పీసీసీ చీఫ్‌ రేవంత్ కు కరీంనగర్ జిల్లా నేతలైన పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు కూడా లోకల్ లీడర్లకే ఇవ్వాలని చూపినట్లు సమాచారం.ఎలాగైనా ఆ స్థానం గెలవాలనే ఆలోచనతో రేవంత్ బలమైన అభ్యర్థి కావాలంటూ మాజీ మంత్రి కొండా సురేఖ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం . కొండా దంపతులు హుజురాబాద్ లో పోటీ చేస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఎంటర్ అవుతారు అని అది అక్కడి సీనియర్లకు ఇష్టంలేదని తెలుస్తుంది .

మొత్తానికి హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి ఒక సమస్యగా మారినట్టు తెలుస్తుంది . రేవంత్ అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి ఎన్నికలు కావడంతో ఎలాగైనా గెలుపును అందుకోవాలని ఆశతో ఉన్నాడు . అందుకే బలమైన హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కోసం చూస్తున్నాడు . లోకల్ నాయకులకు టికెట్ ఇస్తే ఆఖరి నిముషములో ప్రలోభాలకు లోంగే అవకాశమా ఉండనేది రేవంత్ ఆలోచన . చూడాలి ఏంచేస్తారో కాంగ్రెస్ నాయకులూ .

ముక్కు అవినాష్ పెళ్లి : ఎంగేజ్ మెంట్ చేసుకున్న బిగ్ బాస్ అవినాష్- Wow