హైదరాబాద్ వరదలు ఆస్తి , ప్రాణ నష్టంతో పాటు అనేక ఇబ్బందులకు గురిచేసింది . వరద బాదితులందరిని ఆడుకుంటాము అని సోమవారం తెలంగాణ సీఎం ముఖ్య ప్రకటన చేసారు .

సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ వరదల వల్ల నష్టాలపై సమీక్ష నిర్వహించారు . వరద బాధితులను ఆదుకొనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు . సీఎం వరదల్లో నస్టపోయిన వారిని అన్నివిధాల ఆడుకుంటాము అని ప్రకటించారు . నష్టపోయిన వారికీ ఆర్ధిక సహాయం చేయాలనీ నిర్ణయించారు . వరదలలో ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికీ లక్ష రూపాయిలు ఇవ్వనున్నారు . పాక్షికంగా పాడయిన ఇళ్లకు 50 వేలు , వరదతో నష్టపోయిన ప్రతి ఇంటికి 10 వేలు తక్షణ సహాయం ఇవ్వాలని నిర్ణయించారు . ఈ సహాయాన్ని మంగళవారం నుండే ఇవ్వాలని సీఎం అధికారులకు చెప్పారు .
ప్రభుత్వ లెక్కల ప్రకారం నగరంలో 72 ఏరియాలలో 144 కాలానిలలో 20,540 ఇండ్లు జలమయం అయ్యాయి .దాదాపు 35 వేల కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి . చార్మినార్ , సికింద్రాబాద్ ,ఖైరతాబాద్ జోన్ లలో వరద ప్రభావం చాల ఎక్కువగా ఉన్నది . ప్రభుత్వ ప్రకారం 14 ఇండ్లు పూర్తిగా , 50 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి . రాష్ట్రంలో మొత్తం 50 మంది చనిపోయారు వాళ్లకి ఇంతకు ముందే కుటుంబాలను ఆదుకోవడానికి 5లక్షల ఎక్సగ్రేషియా సీఎం ప్రకటించాడు .
Also Read
అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభం ..అవతారాలు నైవేద్యాలు – Blessed