హైద్రాబాద్ లోడబుల్ డెక్కర్లు : మల్లి మహానగరంలో తిరగనున్న బస్సులు …. 25 బస్సులతో మొదలు- Wow

0
1176
హైద్రాబాద్ లోడబుల్ డెక్కర్లు మల్లి చక్కర్లు కొట్టనున్నాయి . ఒకప్పుడు మహానగరం లో డబుల్ డెక్కర్ బస్సులు మంచి ఫేమస్ గ ఉండేవి . సిటీ కి ఎవరు వచ్చిన వాటిగురించి మాట్లాడుకునేవారు . మల్లి అలాంటి బస్సులు హైదరాబాద్ రోడ్లపై కనువిందు చేయనున్నాయి . మొదటగా ఒక 25 బస్సులను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది . దానికోసం టెండర్లు కూడా ఆహ్వానించింది .
హైద్రాబాద్ లోడబుల్ డెక్కర్లు

ఫిబ్రవరి 18 న ఆర్టీసీ ఫ్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనుంది . తయారీదారులకు బస్సుల మోడల్ ఎలా ఉండాలి అనే దాని మీద క్లారిటీ ఇవ్వనున్నారు . ఒక నగర వాసి రెండు నెలల క్రితం డబుల్ డెక్కర్ బస్సులను గుర్తుకు చేసుకుంటూ అప్పటి ఫోటోలను ట్విటర్లో ఉంచుతూ కేటీఆర్ గారికి ట్యాగ్ చేసాడు . దీనికి కేటీఆర్ కూడా తన అనుభూతులను నెమరు వేసుకున్నారు . అలాగే అప్పట్లో ఎందుకు హైద్రాబాద్ లో డబుల్ డెక్కర్లు బస్సులను తీసేయవలసి వచ్చిందో నాకు తెలియదు , వాటిని ఇప్పుడు నడపడం సాధ్యమవుతుందా అని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కి ట్యాగ్ చేసారు .
దీనికి రవాణా మంత్రి వెంటనే ఆర్టీసీ ఎండి తో మాట్లాడి ప్రయోగాత్మకంగా బస్సులను తిప్పాలని సూచించారు . రూట్ నెం . 218 కోటి – పటాన్ చెరువు వయా అమీర్ పెట్ . రూట్ నెం. 229 సికింద్రాబాద్ – మేడ్చల్ వయా సుచిత్ర , రూట్ నెం . 9 ఎక్స్ సీబీఎస్ – జీడీ మెట్ల వయా అమిర్ పెట్, రూట్ నెం. 118 ఆఫ్జల్ గంజ్ – మెహిదీపట్నం మార్గాలను ప్రస్తుతానికి ఎంపిక చేసారు . కేబుల్ బ్రిడ్జ్ పై కూడా బస్సును నడిపేలా ప్లాన్ చేస్తుంది ఆర్టీసీ .

మదనపల్లె డెత్ మిస్టరీ… పునర్జన్మ ప్రయోగాలే అక్కా చెల్లెళ్ళ మరణానికి కారణమా ? Death