ghmc elections 2020 ఎన్నికల నోటిఫికేషన్ అనుకున్న విధంగాన్నే విడుదల అయింది . ఈ నోటిఫికేషన్ తేదీలపై పార్టీలు సీరియస్ గా ఉన్నాయి .

జీ హెచ్ ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడులవడంతో పాటు నామినేషన్ పక్రియ బుధవారం నుండే మొదలవుతుంది . పోలింగ్ డిసెంబర్ 1 న జరుగనుంది . వోటింగ్ జరిగే రోజుకు కేవలం 13 రోజులు మాత్రమే ఉంది . అభ్యర్థులను ఎన్నుకోవాలన్న , పార్టీ ప్రచారం చేసుకోవాలి అన్న ఈ సమయం సరిపోదు . అందుకే ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ పై అన్ని ప్రతి పక్ష పార్టీలు మండి పడుతున్నాయి .
బీజేపీ దుబ్బాక విజయం ఉత్సహంతో జీ హెచ్ ఎంసీ లోకూడా గెలిచి సత్తా చాటాలి అనుకుంటుంది . గత ఎన్నికలలో మాదిరిగానే అధికార పార్టీ లాభపడే విధంగా చూస్తుంది అని , ఇతర పార్టీలకి తగిన సమయం ఇవ్వకుండా తెరాస కు ఉపయోగ పడేలా ఈసీ షెడ్యూల్ ఇచ్చిందని బీజేపీ ఆరోపిస్తుంది .
ఎన్నికల షెడ్యూల్ పై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేయాలనుకుంటుంది . తెలంగాణ ఎన్నికల సంఘం కేసీఆర్ చెప్పినట్టు వింటుంది అని , అందుకే ఎన్నికల తేదీలు ఆ పార్టీకి అనుకూలంగా ప్రకటించింది అని బీజేపీ అంటుంది . ghmc elections 2020 కౌంటింగ్ డిసెంబర్ 4 న నిర్వహిస్తారు .
Also Read
జీ హెచ్ ఏం సి ఎన్నికల నోటిఫికేషన్ 2020 విడుదల… బ్యాలెట్ పద్దతిలోనే