HYDERABAD FLOODS నగరంలో పడుతున్న భారీ వర్షాలు , వరదల వాళ్ళ కలిగే పరిస్థితులకు అలెర్ట్ గా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు .
హైదరాబాద్ నగరంలో నీటిపారుదల ఇంజనీర్ లు ,అధికారులు , సిబ్బందితో 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలనీ సూచించారు . నగరంలోని చెరువుల పరిస్థితి ఎప్పుటికప్పుడు సమీక్షించాలని అన్నారు .బుధవారం మధ్యాహ్నం నగరంలో జరుగుతున్న సహాయక చర్యలపై , వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు .వంద ఏళ్లలో ఎప్పుడు పడని విధంగా హైదరాబాద్ లో వర్షాలు పడ్డాయని సమీక్షలో అధికారులతో అన్నారు .
చెరువులు ప్రమాదకరంగా ఉన్నచోట , వరద నీరుతో ప్రభావానికి గురయ్యే ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి .వాళ్ళందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించండి . హైదరాబాద్ లోని అన్ని చెరువులను పరిశీలించండి , ప్రమాదకర చెరువులను గుర్తించి జాగ్రత చర్యలు తీసుకోండి . చెరువు గట్లు తెగెటట్టు ఉంటె వెంటనే మరమత్తులు చేయండి అని కేసీఆర్ అధికారులకు సూచించారు .
వర్షాలకు ప్రభావితం అయిన ప్రజలను ఆదుకునే విధముగా కేసీఆర్ సోమవారం ప్రకటన విషయం మన అందరికి తెలిసిందే . వరద బాధితులకు మున్సిపల్ శాఖకు రూ.550 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం . పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు 1 లక్ష , పాక్షికంగా దెబ్బ తిన్న ఇళ్లకు 50 వేలు , నష్టపోయిన వారికీ 10 వేలు తక్షణ సహాయం ప్రకటించారు .
Also Read