N 95 మాస్క్ : ఇది ఎలా వాడాలి..ఎన్నిరోజులు వాడాలి.. డబల్ మాస్క్ మార్గదర్శకాలు

0
2045
N 95 మాస్క్ : ఈ మాస్క్ లు కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే . అందుకే అందరు ఈ తరహా మాస్క్ లను వినియోగిస్తున్నారు . అయితే అందరి సందేహం ఏమిటి అంటే N 95 మాస్క్ ను ఉతకవచ్చా , అది ఎన్ని రోజుల వరకు వాడవచ్చు అనేది . కానీ నిపుణులు మాత్రం ఈ మాస్క్ ను శుద్ధి చేసే పద్దతి వేరు అని చెపుతున్నారు . ఇప్పడు కొత్తగా కేంద్రం కూడా డబల్ మాస్క్ విషయంలో కొత్త మార్గ దర్శకాలు విడుదల చేసింది ఆ వివరాలు చూద్దాం .
N 95 మాస్క్

N 95 అందరికి ఉద్దేశించి తయారు చేసినవి కావు . ఇవి ముఖ్యంగా డాక్టర్స్, నర్స్లు , అంబులెన్సు డ్రైవర్స్ , వైద్య సిబ్బందికి , ఇంట్లో కోవిద్ రోగులు ఉంటె వారికీ సహాయం చేసేవారి కోసం ఉద్దేశించబడినవి . ఈ మాస్క్ లను ప్రతి 8 గంటలకు ఒక సారి మార్చాలి .

ఉతక వచ్చా

వీటిని ఉతికి వాడుకోవడానికి ఉపయోగపడవు . సబ్బుతో ,నీటితో , మెడికల్ హల్కహాల్ తో కడిగిన వీటి సామర్ధ్యం చాలా గణనీయంగా తగ్గిపోతుంది . వైరస్ ను వడపోసే ననుట తగ్గిపోతుంది . వీటిని శుబ్రపరిచే పద్దతి వేరే . తొలిరోజు వాడుకున్న మాస్క్ ను వాడిన తరువాత పేపర్ లో భద్రపరుచుకోవాలి ,రోజుకో కొత్త మాస్క్ లచొప్పున నాలుగు మాస్క్ లను వాడి భద్రపరుచుకోవాలి . ఐదొవ రోజు మొదటి రోజు వాడి న మాస్క్ ను మల్లి వాడుకోవాలి .అప్పటికి దాని ఏమైనా వైరస్ ఉంటె ఎండిపోతాయి . ఇలా ఒక మాస్క్ 20 రోజులలో ఐదు సార్లే వాడుకోవాలి . ఈ మాస్క్ లు అందుబాటులో లేకపోతె సర్జికల్ మాస్క్ వాడుకోవాలి . అది కూడా ఒక్కరోజే ఉపగోగించుకోవాలి . సర్జికల్ మాస్క్ ను ఉతికి వాడుకోరాదు అని నిపుణులు తెలుపుతున్నారు .

కేంద్ర మార్గదర్శకాలు

రెండు మాస్క్ లు ధరించే విషయంలో కేంద్రం కొత్త మార్గ మార్గదర్శకాలు విడుదల చేసింది .
రెండు మాస్క్ లు ఎలా ధరించాలి అంటే : ఒకటి చార్జికల్ మాస్క్ , రెండోది రెండు లేదా మూడు పొరల మాస్క్ ధరించాలి .
ముక్కు మీద బిగుతుగా ఉండేలా చూడాలి
శ్వాస ఇబ్బంది కలిగేలా మాస్క్ ధరించరాదు .
క్లాత్ మాస్క్ శుభ్రంగా ఉతుకుతు ఉండాలి .
రెండు ఒకే రకమైన మాస్క్ లు వాడవద్దు
ఒకే మాస్క్ రెండు రోజులు వరుసగా వాడవద్దు

కరోనా వైరస్ ముక్కులోకి సాధారణ మాస్క్ కన్నా రెండు మాస్క్ లు ధరించినప్పుడు సమర్థవంతంగా అడ్డుకుంటుంది అని పరిశోధనలో తేలింది .

13 రోజులు నిద్రపోతుంది…. ఈమె పడుకుంటే ఆతరువాతే లేస్తుంది- Shocking