Omicron variant కరోనా : లక్షణాలు … ఇది అంత ప్రాణాంతకం కాదు … నిపుణుల వెల్లడి

0
1227
Omicron variant కరోనా :సౌత్ ఆఫ్రికాలో బయటపడిన ఓమైక్రాన్ వేరియంట్ ఇంతకముందు వచ్చిన డెల్టా వేరియంట్( delta variant) కన్నా తక్కువ ప్రాణాంతకమే అని వైద్య నిపుణులు వెల్లడించారు . ఈ వేరియంట్ లక్షణాలు కొంత అసాధారణమైనప్పటికీ అంతా ప్రభావం చూపవని నిపుణులు అంటున్నారు .
Omicron variant కరోనా

సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రాన్ వేరియంట్ బాధితులతో అక్కడి ఆసుపత్రులు , ఆరోగ్య క్యాంపు లు నిండిపోతున్నాయి . అయితే వాళ్ళ లక్షణాలు అంతుబట్టక పోయిన ఈ వేరియంట్ అంతగా ప్రభావం చూపటంలేదు అని వైద్యులు అంటున్నారు . కొత్త వేరియంట్ విషయంలో కొంచెం బయన్దోళనలు ఉన్న సమయంలో ఈ ప్రకటన కొంచెం ఉరటనిచ్చేదే .

జోహెన్స్ బర్గ్ లో కోవిద్ బాధితులంతా ఈ Omicron variant కరోనా తో 90% మంది ఉన్నట్లు సమాచారం . కానీ ప్రాణ నష్టం అంతగా లేదు అనేది తెలుస్తుంది .

లక్షణాలు : ఈ వేరియంట్ సోకినా వాళ్లలో వికారం , అలసట, తలనొప్పి ,పల్స్ రేట్ అధికంగా ఉంటుంది . కానీ ఎవరు రుచి వాసన కోల్పోవటంలేదు అని అక్కడి వైద్యులు తెలిపారు . యిది వేగంగా వ్యాప్తి చెందుతుండి .యూకే , జర్మనీ , నెథర్లాండ్స్ ,బెల్జియం ,చెక్ రిపబ్లిక్,ఇటలీ , కెనడా దేశాలలో ఇప్పటి వ్యాపించింది

Tandoori Tea : మంచి దమ్ చాయ్ ..హైదరాబాద్ స్ట్రీట్ టీ