T20 వరల్డ్ కప్ 2021 : భారత్ vs పాక్ … మరో బిగ్ మ్యాచ్

0
1264
T20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే . ఈ సారి ఐసీసీ ప్రపంచ కప్ లో మొత్తం నాలుగు గ్రూప్ లుగా కారు చేసింది . అవి గ్రూప్ – ఏ , గ్రూప్ – బి , గ్రూప్ -1, గ్రూప్ – 2 లు . ఇంకా మ్యాచ్ డేట్స్ ప్రకటించలేదు .
T20 వరల్డ్ కప్ 2021

T20 వరల్డ్ కప్ 2021 లో ప్రధాన 8 జట్లు గ్రూప్ -1, గ్రూప్ – 2 ఇప్పటికే చోటు సంపాదించాయి . మిగితా జట్లు మిగిలిన రెండు గ్రూప్ లలో ఉన్నాయి . గ్రూప్ -ఏ , గ్రూప్ – బి లలోని విజేతలు , రన్నర్ అప్ జట్లు తరవాత దశలో సూపర్ -12 కు అర్హత అంటే గ్రూప్ -1, 2 లలో చోటు సంపాదించుకుంటాయి .

ఇక్కడ పెద్ద విషయం ఏంటి అంటే భారత్ , పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి . గ్రూప్ – 2 లో భారత్ … పాకిస్థాన్ , ఆఫ్గా నిస్తాన్ , న్యూజిలాండ్ తో మ్యాచ్ లు ఆడుతుంది . గ్రూప్ -1 లో వెస్టిండీస్ .. ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , సౌత్ ఆఫ్రికాతో ఆడుతుంది . మిగితా జట్లు శ్రీలంక , నెథర్లాండ్స్ , ఐర్లాండ్ గ్రూప్ – ఏ లో , బాంగ్లాదేశ్ , స్కాట్లాండ్ , పపువాన్యూగియ ,ఒమాన్ గ్రూప్ – బి లో ఉన్నాయి . ఈ పోటీలను బీసీసీఐ యూఏఈ , ఒమాన్ లలో నిర్వహిస్తుంది .

ఐపీఎల్ కొత్త జట్లు : వాటి ధర ఎంత అంటే ? wow