Trs Manifesto : గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ గ్రేటర్ ప్రజలకు శుభవార్త చెప్పారు . నీటి బిల్లులు చెల్లించ వలసిన అవసరం లేదు అని ప్రజలకు ఎన్నికల సందర్భంగా తీపి కబురు చెప్పారు .

సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ డిసెంబర్ 2020 నుండి గ్రేటర్ పరాజయాలు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా వాటర్ బిల్లులు చెలించాల్సిన అవసరంలేదు అన్నారు . నవంబర్ వరకు మాత్రమే నల్ల బిల్లులు చెలించడి అని చెప్పారు . దీనికి గాను 97% మంది ప్రజలకు లబ్ది చేకూరుతుంది అన్నారు . వందకు వంద శాతం నీటిని పూర్తిగా ఉచితంగా ఉచితంగా అందిస్తాము అన్నారు .
20 వేలు లీటర్ల కు మించి నీటిని వినియోగించే వారికీ మాత్రం కొంత చార్జీలు విదిస్తాము అన్నారు . దీనికి కారణం నీటిని వృధా కాకుండా అరికట్టేందుకే ఈ చార్జీలను తీసుకుంటుంది అన్నారు . అందుకే ప్రజలు నీటిని వృధా చేయకుండా కావలసినంత వాడుకోండి అన్నారు .
జంట నగరాలలో ఎక్కడ నీటి సమస్య లేదు అన్నారు . హైదరాబాద్ దేశంలో గొప్పప నగరం అన్నారు . మిషన్ భగీరథ ద్వారా నీటి సంశయాలు అధిగమించాము అన్నారు . గతంలో నీటికోసం ప్రజలు యుద్దాలు చేయవలసి వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని అన్నారు .
ఈ సందర్భంగా నగర ప్రజలకు వరాల జల్లు కురిపించారు .
Also Read